దట్ ఈజ్ కోహ్లి..

     Written by : smtv Desk | Thu, Feb 08, 2018, 12:02 PM

దట్ ఈజ్ కోహ్లి..

కేప్ టౌన్, ఫిబ్రవరి 8 : విరాట్ కోహ్లి.. రన్ మెషిన్.. కింగ్ కోహ్లి.. పరుగుల వీరుడు... ఇంకా పదాలు దొరకట్లేదు వర్ణించడానికి.. ఎందుకంటే అతని పరుగులు దాహం తీరట్లేదు. స్వదేశంలో తన బ్యాటింగ్ తో ఎన్ని చిరస్మరణీయ విజయాల అందించిన కోహ్లి ఇప్పుడు విదేశంలో అదే ఫాం ను కొనసాగిస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా సఫారీలతో మూడో వన్డేలో శతకంతో జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. ధావన్ ను మినహాయించి మిగతా బ్యాట్స్ మెన్ ఎవరు సహకరించాకపోయిన రెండో ఓవర్లో వచ్చిన విరాట్ నిలకడగా ఆడుతూ చివరి వరకు నిలబడి 160 పరుగులు చేయడం అద్భుతం.

ముఖ్యంగా ప్రోటిస్ పేస్ దళాన్ని ఎదుర్కొంటూ తను ఆడిన తీరు యావత్ క్రీడలోకాన్ని ఆశ్చర్యచకితులను చేసింది. మరోవైపు ఈ సెంచరీ తన కెరీర్ లో 34వ శతకంకాగా, ఈ సిరీస్ లో రెండవది. ఈ విజయంతో సౌతాఫ్రికా గడ్డపై ఇంత వరకు రెండు మ్యాచ్ లు గెలవని టీమిండియా ఆ రికార్డ్ ను బద్దలు గొట్టింది. కఠినమైన పిచ్‌పై మేటి బౌలర్లను ఎదుర్కొంటూ కోహ్లి సాధించిన ఈ ఇన్నింగ్స్‌లో అతడి మార్కు బ్యాటింగ్‌ కళాత్మకతను చూడొచ్చు. ముఖ్యంగా ఆటను సాధించిన 160 పరుగుల్లో (12 ఫోర్లు, 2సిక్స్ లు) అంటే మిగతా పరుగులు వికెట్ల మధ్య వచ్చినవే. తొలి నుండి తుది వరకూ అలసట లేకుండా ఆడిన విరాట్‌ శారీరక, మానసిక దృఢత్వాన్ని సలాం కొట్టకుండా ఉండలేము.

Untitled Document
Advertisements