భారత్ మాల్దీవుల మిత్ర దేశం కాదా..!

     Written by : smtv Desk | Thu, Feb 08, 2018, 12:21 PM

భారత్ మాల్దీవుల మిత్ర దేశం కాదా..!

మాలే, ఫిబ్రవరి 8 : పగడ దీవులైన మాల్దీవులలో అధ్యక్షడు అబ్దుల్లా యమీన్ నియంతృత్వ ధోరణితో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. కాగా పరిష్కారం కోసం సమస్య పరిష్కారం కోసం మాల్దీవులు మిత్ర దేశాల సాయం కోరుతోంది. యమీన్‌ మాల్దీవుల్లో 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని విధించిన సంగతి తెలిసిందే. మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ దేశంలో సంక్షోభ పరిస్థితులను చక్కబెట్టేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు సాయం కోరుతూ మిత్ర దేశాలైన చైనా, పాకిస్థాన్‌, సౌదీ అరేబియాలకు రాయబారులను పంపుతున్నట్లు ప్రకటించారు. అయితే ఆ జాబితాలో భారత్‌ లేకపోవడం గమానార్హం.

మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మొహమ్మద్‌ నషీద్‌ పలుమార్లు భారత్‌ జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలని ట్వీట్ చేశారు. భారత్‌ రాయబారులు, సైన్యాన్ని తమ దేశానికి పంపి పరిస్థితి చక్కదిద్దాలని అభ్యర్ధించారు. ఈ నేపథ్యంలోనే చైనా మాల్దీవులు విషయంలో భారత్‌ జోక్యం చేసుకోవడం మంచిది కాదని పేర్కొంది.

మాల్దీవుల్లో సంక్షోభంలో భారత సైన్యం జోక్యం చేసుకోవద్దని, పరిస్థితిని మరింత సంక్లిష్టం చేయొద్దని, అది మాల్దీవుల అంతర్గత అంశమని చైనా హెచ్చరించిన కొద్దిసేపటికే మాల్దీవులు అధ్యక్షుడు మిత్ర దేశాలైన చైనా, పాక్‌, సౌదీలకు రాయబారులను పంపుతున్నట్లు చెప్పడం చర్చనీయాంశమైంది.





Untitled Document
Advertisements