వాట్ ఏ ఇన్నింగ్స్ విరాట్ : వార్నర్‌

     Written by : smtv Desk | Thu, Feb 08, 2018, 12:42 PM

వాట్ ఏ ఇన్నింగ్స్ విరాట్ : వార్నర్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: సఫారీలతో నిన్న జరిగిన మూడో వన్డేలో భారత్ సారథి కోహ్లి 160 పరుగులతో శతకం సాధించిన విషయం తెలిసిందే. సహచరులు నుండి సహకారం లేకపోయినా అతడి బ్యాటింగ్ విధానం అందరిని ఆకట్టుకుంది. అయితే అతడి ఆట తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ క్రీడాకారుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. సామాజిక మాధ్యమాల వేదికగా ద్వారా కోహ్లీకు అభినందనలు తెలుపుతున్నారు.

* మైదానంలో అడుగుపెట్టి సెంచరీలు సాధించడం కోహ్లీకి అలవాటుగా మారింది. వన్డేల్లో 34వ శతకం సాధించిన నీకు అభినందనలు. ఇలాగే నీ పరుగుల ప్రవాహం కొనసాగాలి : సచిన్‌ తెందుల్కర్‌

* వావ్‌.వాట్‌ ఎ ప్లేయర్‌. వాట్ ఏ ఇన్నింగ్స్ : డేవిడ్‌ వార్నర్‌

* భారత పరుగుల యంత్రం మరో శతకం సాధించింది. వాట్‌ ఎ ప్లేయర్‌. కోహ్లీ ఇదే ఫామ్‌తో కొనసాగు: సురేశ్‌ రైనా

* విరాట్‌ కోహ్లీ నిలకడ గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. అతని బ్యాటింగ్‌ చూస్తూ చాలా ఎంజాయ్‌ చేశాను. ఈ 34వ శతకం అతనికెంతో ప్రత్యేకం: మహమ్మద్‌ కైఫ్‌

* కోహ్లీ చాలా బాగా ఆడావు. నువ్వు సాధించిన శతకాల్లో ఇది ఎంతో ప్రత్యేకం. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా, పరిణతతో ఆడావు: వీవీఎస్ లక్ష్మణ్‌

Untitled Document
Advertisements