వినూత్న నిరసన తెలిపిన ఎంపీ..!

     Written by : smtv Desk | Thu, Feb 08, 2018, 02:46 PM

వినూత్న నిరసన తెలిపిన ఎంపీ..!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 : పార్లమెంటులో టీడీపీ ఎంపీల ఆందోళనల నేపథ్యంలో సభను కాసేపు వాయిదా వేశారు. ఈ వాయిదా అనంతరం మొదలైన లోక్‌సభలో తిరిగి టీడీపీ ఎంపీలు తమ అందోళనలను కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఎంపీ శివప్రసాద్ విభజన హామీలు అమలు చేయాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు.

ఢమరుకం మోగిస్తూ కాసేపు హడావుడి చేశారు. రైల్వే జోన్ క్యా హువా.. అంటూ కిష్టప్ప పాటపాడుతుంటే.. గోవిందా గోవిందా అంటూ మిగతా సభ్యులు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో శివప్రసాద్ పాట పాడుతూ తన నిరసనను వ్యక్తం చేశారు. మంత్రి అనంతకుమార్ చెప్పినా ఎంపీలు శాంతించలేదు.

Untitled Document
Advertisements