కేటీఆర్ సవాల్ ను స్వీకరిస్తున్నా: కోమటిరెడ్డి

     Written by : smtv Desk | Thu, Feb 08, 2018, 03:37 PM

కేటీఆర్ సవాల్ ను స్వీకరిస్తున్నా: కోమటిరెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 8 : "2019 వ సంవత్సరంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.? అదే కాంగ్రెస్ ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా"? అంటూ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేటీఆర్ సవాల్ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. కేటీఆర్ సవాల్ ను స్వీకరిస్తున్నామని ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు తానూ రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కేటీఆర్ మాట్లాడిన భాష మనుషులు మాట్లాడిన భాషేనా.? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారం ఉంది కదాని కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదంటూ విమర్శించారు. ఎన్నికలకు ముందు తనను పార్టీలోకి రమ్మని కేటీఆర్ అడగలేదా? అంటూ నిలదీశారు.

Untitled Document
Advertisements