విదేశీ పర్యటనకు బయలుదేరిన మోదీ..!

     Written by : smtv Desk | Fri, Feb 09, 2018, 03:49 PM

విదేశీ పర్యటనకు బయలుదేరిన మోదీ..!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 : ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. పాలస్తీనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఒమన్‌ ఈ మూడు దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. పాలస్తీనాలో పర్యటించనున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం విశేషం. ఈ నేపథ్యంలో మోదీ నేడు ఢిల్లీ నుండి జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌ చేరుకొని అక్కడ నుండి పాలస్తీనా నగరమైన రామల్లాలోని అధ్యక్ష నివాసానికి చేరుకుంటారు. కాగా ప్రభుత్వం మోదీ పాలస్తీనా పర్యటనను చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించింది. సోమవారానికి మోదీ పర్యటన ముగియనుంది.

Untitled Document
Advertisements