మోదీ ప్రసంగంలో కొత్తేమీ లేదు : సురవరం

     Written by : smtv Desk | Fri, Feb 09, 2018, 04:45 PM

మోదీ ప్రసంగంలో కొత్తేమీ లేదు : సురవరం

హైదరాబాద్, ఫిబ్రవరి 9 : మోదీ ప్రసంగంలో కొత్తదనం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను నేరవేర్చాలంటూ వామపక్షాలు సహా అన్ని వర్గాలు బంద్ ప్రకటించినప్పటికీ భాజాపా మాత్రం ఇందుకు మినహాయింపు అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన సురవరం.. రైల్వే బడ్జెట్‌ చాలా అయోమయంగా ఉందని, అలాగే పెట్రోల్‌, డీజిల్‌పై కస్టమ్స్‌ సుంకం తగ్గిస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఆ ప్రకటనలపై ఇప్పటికీ నిర్ణయం లేదన్నారు.

Untitled Document
Advertisements