చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో..!

     Written by : smtv Desk | Sat, Feb 10, 2018, 11:07 AM

చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో..!

జోహాన్స్ బర్గ్, ఫిబ్రవరి 10 : వరుస విజయాలతో ఊపుమీదున్న భారత్ క్రికెట్ జట్టు సఫారీలతో నాలుగోవ వన్డే పోరుకు సిద్దమయ్యింది. ఆరు వన్డేల సిరీస్ లో భాగంగా 3-0 అధ్యికంలో ఉన్న కోహ్లి సేన ఈ మ్యాచ్ లో గెలుపొంది చరిత్ర సృష్టించాలని చూస్తుంది. ఈ మ్యాచ్ లో కోహ్లి సేన విజయం సాధిస్తే వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానం పదిలంగా ఉంటుంది.

అంతే కాకుండా ఇంతవరకు దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ నెగ్గని భారత్ బోణి కొట్టాలని భావిస్తుంది. టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా కన్పిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో కోహ్లి ఫాం, బౌలింగ్ లో స్పిన్ ద్వయం చాహల్, కులదీప్ యాదవ్ జట్టుకు ప్రధాన బలం. వీరిద్దరూ ప్రోటిస్ జట్టుకు కొరకరాని కొయ్యగా మారారు.

మరో వైపు ఆతిధ్య జట్టు మూడు పరాజయాలతో కసి మీద బరిలోకి దిగనుంది. ఇప్పటికే గాయం కారణంగా మూడు మ్యాచ్ లకు దూరమైనా సఫారీ స్టార్ బ్యాట్స్ మెన్ డివిలియర్స్ పునరాగమనం ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం. వాండరర్స్ లో భారత్ జట్టు ఏడు వన్డేలు ఆడగా మూడు మ్యాచ్ లో నెగ్గింది. కాగా క్యాన్సర్ బాధితులకు సంఘీభావం కోసం గులాబీ దుస్తులతో ఆడిన ప్రతిసారి సౌతాఫ్రికా జట్టు విజయం సాధించింది. మరి ఈ సారి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి..!





Untitled Document
Advertisements