కొత్త జెర్సీలో సందడి చేయనున్న ముంబయి ఇండియన్స్‌..

     Written by : smtv Desk | Sat, Feb 10, 2018, 11:41 AM

కొత్త జెర్సీలో సందడి చేయనున్న ముంబయి ఇండియన్స్‌..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 : ఐపీఎల్‌లో ప్రధాన జట్టునై ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లు ఈ సీజన్ నుండి కొత్త జెర్సీల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్-11 కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ సామ్‌సంగ్‌.. ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంఛైజీతో ఒప్పందం చేసుకుంది. ఇక నుంచి వారి జెర్సీలపై వీడియోకాన్‌ డీ2హెచ్‌ బదులు సామ్‌సంగ్‌ అని కనిపించనుంది.

తాజా ఒప్పందంతో గత ఐదేళ్ల నుంచి ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్ల జెర్సీలకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న వీడియోకాన్‌ డీ2హెచ్‌కు తెరపడింది. మూడు సార్లు ఐపీఎల్ లో విజేతగా నిలిచినా ముంబై జట్టు ఈ సారి టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. కాగా ఈ గత నెల 27, 28జరిగిన వేలంలో ఆటగాళ్లను ఆయా ఫ్రాంఛైజీలు దక్కించుకొన్న విషయం తెలిసిందే. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ ఏప్రిల్ 7 నుండి ప్రారంభం కానుంది.

Untitled Document
Advertisements