కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేయనున్న రాహుల్..

     Written by : smtv Desk | Sat, Feb 10, 2018, 12:52 PM

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేయనున్న రాహుల్..

బళ్లారి, ఫిబ్రవరి 10 : కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రము కర్ణాటక.. ఇప్పటికే మోదీ, అమిత్ షా చతురతతో 19 రాష్ట్రాల్లో పాగా వేసిన కమలాదళం చూపు ఈ సారి కర్ణాటకపై పడింది. ఈ సారి బీజీపీ రూపంలో హస్తం పార్టీకి గట్టిపోటి తగలనుంది. కాగా ఏప్రిల్ చివరివారం, లేదా మే మొదటి వారంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు నుండి నాలుగురోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

బళ్లారి నుంచి ఆయన తన ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. కొప్పల్‌లోని ప్రఖ్యాత హులిగమ్మ ఆలయాన్ని రాహుల్ తొలుత సందర్శించే అవకాశాలున్నాయి. సోనియాగాంధీ నాయకత్వంలో 2013లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని రాహుల్ గుర్తుచేస్తూ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్తున్న కాంగ్రెస్‌కే మరోసారి పట్టం కట్టాలని ఓటర్లను కోరనున్నారు.

Untitled Document
Advertisements