భారత్ పై పాక్ దొంగదెబ్బ.. ఇద్దరు జవాన్లు మృతి...

     Written by : smtv Desk | Sat, Feb 10, 2018, 02:14 PM

భారత్ పై పాక్ దొంగదెబ్బ.. ఇద్దరు జవాన్లు మృతి...

జమ్మూకశ్మీర్, ఫిబ్రవరి 10 : ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దాడి నేపథ్యంలో పఠాన్‌కోట్‌లో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. ఉదయం 4.55 ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించామని, సుంజ్వాన్ క్యాంప్‌కు పక్కనే ఉన్న జేసీఓ ఫ్యామిలీ క్వార్టర్‌లో చొరబడి కాల్పులకు పాల్పడినట్లు జమ్మూ ఐడీపీ ఎస్‌డీ సింగ్ జామ్వాల్ తెలిపారు.

ఏ ఉగ్రసంస్థ దాడికి పాల్పడారో.. ఎంతమంది పాల్పడ్డారో ఇంకా తెలియరాలేదని, ముష్కరుల కోసం గాలిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. పోలీసులు, సైన్యం రంగంలోకి దిగి క్వార్టర్స్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారని తెలిపారు. నేడు అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా ఉగ్రవాదులు దాడి చేసే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఇక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ జవాన్ల మృతిపై సంతాపం తెలిపారు.

Untitled Document
Advertisements