ఛాంపియన్స్ ట్రోఫీకి పన్ను మెలిక..

     Written by : smtv Desk | Sat, Feb 10, 2018, 03:02 PM

ఛాంపియన్స్ ట్రోఫీకి పన్ను మెలిక..

దుబాయ్‌, ఫిబ్రవరి 10 : ఛాంపియన్స్‌ ట్రోఫీ -2021 భారత్ లో నిర్వహించే విషయంపై సందిగ్ధత నెలకొంది . ఈ టోర్నీ ఇండియాలో నిర్వహించాలంటే ఐసీసీ పన్ను మెలికతో బీసీసీఐని ఇరకాటంలో పెట్టింది. 2021లో చాంపియన్స్‌ ట్రోఫిని భారత్‌లో జరగాలంటే పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది. 2016లో టీ20 ప్రపంచకప్‌నకు భారత్‌ ఆతిథ్యం ఇచ్చినప్పుడు నిర్వహణకు పన్ను మినహాయింపు ఇవ్వలేదు.

శుక్రవారం దుబాయ్‌లో జరిగిన తమ బోర్డు మీటింగ్‌లో ఈమేరకు నిర్ణయం తీసుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ వేదికలను కూడా చూడాలనుకుంటోంది. ’భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్స్‌కు పన్ను మినహాయింపు ఉండడం లేదు. ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడతామని బీసీసీఐ మాకు హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో ఇదే టైమ్‌జోన్‌లో ఉండే ఇతర దేశాలపై మేం దృష్టి సారిస్తాం’ అని ఐసీసీ పేర్కొంది.





Untitled Document
Advertisements