‘టాక్సీవాలా’ గా రానున్న అర్జున్ రెడ్డి..!

     Written by : smtv Desk | Sat, Feb 10, 2018, 03:38 PM

  ‘టాక్సీవాలా’ గా రానున్న అర్జున్ రెడ్డి..!

హైదరాబాద్, ఫిబ్రవరి 10 ‌: 'అర్జున్‌రెడ్డి' సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ సృష్టించిన యువ హీరో విజయ్‌ దేవరకొండ. ఈ సినిమాతో యువతలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కాగా ప్రస్తుతం ఆయన నూతన దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీలుక్‌ను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. ఈ ప్రీలుక్‌ చాలా విభిన్నంగా ఉంది. ఓ మైదానంలో వెళ్తోన్న పాతకాలంనాటి కారును చూపించారు. దీన్ని విజయ్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘సమయం వచ్చింది.. ఐయాం బ్యాక్‌’ అని ట్వీట్‌ చేశారు.

ఈ సినిమాకు ‘టాక్సీవాలా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు, ఇందులో విజయ్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. మరోవైపు విజయ్ కథానాయకుడిగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో, పరుశురం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అలనాటి నటి సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’లోనూ విజయ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Untitled Document
Advertisements