'తొలిప్రేమ' ఒక చక్కటి ప్రేమకథ : కేటీఆర్‌

     Written by : smtv Desk | Sun, Feb 11, 2018, 12:03 PM

'తొలిప్రేమ' ఒక చక్కటి ప్రేమకథ : కేటీఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 11‌: మెగాప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా జంటగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'తొలిప్రేమ'. నిన్న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. కాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం రాత్రి ఈ సినిమాను వీక్షించారు. సినిమా బాగుందంటూ తన ట్విటర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు.

" 'తొలిప్రేమ' సినిమా చూశాను. దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాను చాలా తెరకెక్కించారు. పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగున్నాయి. చాలా కాలం తరువాత తెలుగులో ఓ చక్కటి ప్రేమకథా చిత్రం చూశాను. వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా చాలా బాగా నటించారు" అంటూ కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు. కేటీఆర్‌ ట్వీట్‌పై కథానాయక రాశి ఖన్నా స్పందించారు. ‘మీకు సినిమా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సర్‌’ అని ట్వీట్‌ చేశారు.

Untitled Document
Advertisements