నితిన్ @ ‘ఛల్‌ మోహన్‌రంగ’..

     Written by : smtv Desk | Sun, Feb 11, 2018, 01:13 PM

నితిన్  @ ‘ఛల్‌ మోహన్‌రంగ’..

హైదరాబాద్, ఫిబ్రవరి 11 ‌: టాలీవుడ్ ప్రముఖ హీరో నితిన్‌, మేఘా ఆకాష్ కథానాయకగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పీకే క్రియేటివ్‌ వర్క్స్‌, శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు పవన్‌ కల్యాణ్ తో పాటు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కూడా నిర్మాతగా వ్యహరిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ‘ఛల్‌ మోహన్‌రంగ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ముందుగా ఈ చిత్రానికి ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్‌ పరిశీలించినట్లు వార్తలు హల్ చల్ చేశాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో నితిన్‌, మేఘా ఆకాశ్‌లు గంతులేస్తుండడం అభిమానులను ఆకట్టుకొంటుంది. ఏప్రిల్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు నితిన్ దిల్ రాజు నిర్మాతగా, సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శ్రీనివాస కల్యాణం' సినిమాలోనూ నటిస్తున్నారు.

Untitled Document
Advertisements