దుబాయ్‌లో తొలి హిందూ ఆలయ శంకుస్థాపన చేసిన మోదీ..

     Written by : smtv Desk | Sun, Feb 11, 2018, 02:13 PM

దుబాయ్‌లో తొలి హిందూ ఆలయ శంకుస్థాపన చేసిన మోదీ..

దుబాయ్, ఫిబ్రవరి 11 ‌: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లో హిందువుల తొలి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బోచసాన్వాసి శ్రీ అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌ సంస్థ(బీఏపీఎస్‌) ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణ ప్రాజెక్టు జరుగుతోంది. ఆలయ శంకుస్థాపన తర్వాత ఆయన దుబాయ్‌లోని ఒపెరా హౌస్‌లో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. " హిందువుల కోసం ఆలయ నిర్మాణానికి అంగీకరించిన దుబాయ్‌ యువరాజుకు 125కోట్ల భారతీయుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్‌ నుంచి వచ్చిన 30 లక్షల మందికి గల్ఫ్ దేశాలు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఈ ఆలయం ప్రత్యేకంగా ఉండటమే కాదు.. వసుధైక కుటుంబం అనే సందేశాన్ని కూడా ఇస్తుంది" అని మోదీ వెల్లడించారు.

Untitled Document
Advertisements