రష్యాలో ఘోర విమాన ప్రమాదం..

     Written by : smtv Desk | Sun, Feb 11, 2018, 07:40 PM

రష్యాలో ఘోర విమాన ప్రమాదం..

మాస్కో, ఫిబ్రవరి 11 : రష్యాలో విషాదం చోటుచేసుకుంది. సరోత్సవ్ ఎయిర్‌లెన్స్‌కు చెందిన ఏఎన్‌-148 విమానం అర్గునోవ్ గ్రామం సమీపంలో కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో 71 మంది మరణించినట్లు తెలుస్తుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం సిగ్నల్స్ రాడార్‌కు అందలేదని సమాచారం.

మాస్కోకు వాయవ్యంగా ఉన్న అర్గునోవ్ సమీపంలో విమానం కూలి ఉంటుందని సహాయక బృందాలు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. 65 మంది ప్రయాణికులుండగా, ఆరుగురు ఎయిర్‌లైన్స్ సిబ్బంది విమానంలో ఉన్నారు. అయితే ప్రమాదంలో అందరూ మృతిచెంది ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Untitled Document
Advertisements