జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు..

     Written by : smtv Desk | Mon, Feb 12, 2018, 01:02 PM

జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు..

హైదరాబాద్, ఫిబ్రవరి 12 ‌: నగరంలో ప్రశాంతంగా ఉండే జూబ్లీహిల్స్‌లో సోమవారం భారీ పేలుడు సంభవించింది. రోడ్డు నెంబర్‌ 48 లో ఓ పారిశ్రామిక వేత్త గృహ నిర్మాణం కోసం స‍్థలంలో జిలెటిన్‌ స్టిక్స్ పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్ల తీవ్రతకు పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. పేలుడు సందర్భంగా భారీ శబ్దం రావడంతో స్ధానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Untitled Document
Advertisements