'సైరా' లో మరో ట్విస్ట్..!

     Written by : smtv Desk | Mon, Feb 12, 2018, 03:54 PM

'సైరా' లో మరో ట్విస్ట్..!

హైదరాబాద్, ఫిబ్రవరి 12 ‌: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా, నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాలో చిరు సరసన నయనతార నటిస్తున్నారు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నట్లు గతంలో చిత్రబృందం వెల్లడించింది.

కానీ కొన్ని కారణాల వల్ల రెహమాన్‌ సినిమా నుంచి తప్పుకొన్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎం.ఎం కీరవాణి, తమన్ సంగీతం అందిస్తారని పుకార్లు వినిపించాయి. అయితే ఇప్పుడు మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకు బాణీలు అందిస్తారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. సినిమా ప్రారంభం నుండి సంగీత దర్శకుడి విషయంలో స్పష్టత రావడంలేదు. ఇప్పటికైనా నిర్మాత రామ్ చరణ్ స్పందించి ఈ ఊహాగానాలకు చెక్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Untitled Document
Advertisements