రికార్డు సృష్టించిన జీహెచ్‌​ఎంసీ..

     Written by : smtv Desk | Mon, Feb 12, 2018, 06:48 PM

రికార్డు సృష్టించిన జీహెచ్‌​ఎంసీ..

హైదరాబాద్, ఫిబ్రవరి 12 : నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు జీహెచ్‌​ఎంసీ స్వచ్చ సర్వేక్షన్‌ కార్యక్రమం చేపట్టింది. నగరంలోని బాగ్‌లింగంపల్లిలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో 15వేల మంది పాల్గొన్నారు. వీరంతా ఒకే సారి మూడు నిమిషాల పాటు చీపురు పట్టి సామూహికంగా రోడ్లు శుభ్రం చేసి గిన్నీస్ రికార్డు సృష్టించారు.

స్వచ్ఛభారత్‌లో భాగంగా గుజరాత్‌లోని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ గత ఏడాది మే నెలలో 5,058 మంది విద్యార్థులతో రోడ్లను ఊడ్చి రికార్డు సృష్టించింది. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఆ రికార్డును అధిగమించింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్, వివిధ కళాశాలల నుంచి వేలాదిగా విద్యార్థులు పాల్గొన్నారు.

Untitled Document
Advertisements