కన్ను కొట్టింది.. మనసులను ఆకట్టుకొంది..

     Written by : smtv Desk | Tue, Feb 13, 2018, 11:16 AM

కన్ను కొట్టింది.. మనసులను ఆకట్టుకొంది..

హైదరాబాద్, ఫిబ్రవరి 13 ‌: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతో మంది సెలబ్రిటీలు గా మారిపోతున్నారు. ప్రస్తుతం ట్రెండ్ లైక్, కామెంట్ లతో నడుస్తుంది. కాకపోతే ఎటువంటి మాటలు లేకుండా ఓ అమ్మాయి తన కనుసైగలతో అందరి మనసులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె పలికించిన హావభావాలు.. యూట్యూబ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఇలా అన్ని సామాజిక అనుసంధాన వేదికలూగా మారుమ్రోగుతున్నాయి. ఆమె పేరే ప్రియ ప్రకాశ్‌ వారియర్‌..

ఆమె కథానాయికగా నటిస్తున్న ‘ఒరు అదర్‌ లవ్‌’ చిత్రంలోని ‘మణిక్య మలరాయ’ అనే పాటలో ఆమె కళ్లతో పలికించిన హావభావాలుకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 45 లక్షల మందికి పైగా వీక్షించారు. 27 సెకన్లలోనే సోషల్‌మీడియాలో ఈ వీడియో సంచలనం సృష్టించింది. ‘‘ఒరు అదార్‌ లవ్‌’’ సినిమాతోనే తెరంగేట్రం చేస్తున్నప్రియాంక త్రిస్సూర్‌లో డిగ్రీ చదువుకుంది.

Untitled Document
Advertisements