సిరీస్ లక్ష్యంగా బరిలోకి భారత్..

     Written by : smtv Desk | Tue, Feb 13, 2018, 12:56 PM

సిరీస్ లక్ష్యంగా బరిలోకి భారత్..

పోర్ట్‌ఎలిజబెత్‌, ఫిబ్రవరి 13 : దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ నెగ్గాలన్న టీమిండియా క్రికెట్ జట్టు నాల్గోవ వన్డేలో పరాజయం పాలైంది. ఆరు వన్డే సిరీస్ లో భాగంగా ఇప్పటికే భారత్ 3-1 తో ఆధిక్యంలో ఉంది. గులాబీ దుస్తులతో ఆపజయం లేని సెంటిమెంట్ ను కొనసాగిస్తూ సఫారీ జట్టు నాలుగవ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ లో ఆశలు సజీవంగా ఉంచుకుంది. వర్షం అడ్డు రావడం, కోహ్లి సేన స్వీయ తప్పిదాలతో మ్యాచ్ ఓడినప్పటికీ భారత్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

టీమిండియా జట్టులో కెప్టెన్ కోహ్లి, శిఖర్ ధావన్ వీరోచిత ఫాంలో ఉండగా, రోహిత్ శర్మ వైఫల్యం జట్టును ఆందోళన పరుస్తుంది. బౌలింగ్ విభాగంలో స్పిన్ ద్వయం చాహల్, కులదీప్ యాదవ్ జోహాన్స్ బర్గ్ లో లయ తప్పిన, మరోసారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తున్నారు.

మరోవైపు ఆతిధ్య జట్టు డివిలియర్స్ రాకతో బలంగా మారింది. డేవిడ్‌ మిల్లర్‌, క్లాసెన్‌ టచ్ లోకి రావడం సానుకూలాంశా౦. ఈ మ్యాచ్ ఎలాగైనా నెగ్గి కోహ్లిసేన సిరీస్ నెగ్గి చరిత్ర లిఖించాలని చూస్తుంది. మర్క్రం సారథ్యంలోని ప్రత్యర్ధి జట్టు టీమిండియాను ఓడించి సిరీస్ లో తన హవా చాటాలని భావిస్తుంది.

Untitled Document
Advertisements