కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో పేలుడు.. ఐదుగురు దుర్మరణం..

     Written by : smtv Desk | Tue, Feb 13, 2018, 01:26 PM

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో పేలుడు.. ఐదుగురు దుర్మరణం..

కోచి, ఫిబ్రవరి 13 : కేరళలోని కొచ్చిన్‌లో గల నౌకల నిర్మాణ కేంద్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 15 మంది క్షతగాత్రులయ్యారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ)కి చెందిన సాగర్‌ భూషణ్‌ నౌకను మరమ్మతుల నిమిత్తం కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ఉంచారు. సిబ్బంది మరమ్మతులు చేస్తుండగా.. ఒక్కసారిగా నౌకలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Untitled Document
Advertisements