జమ్మూలో కొనసాగుతున్న ఆ"పరేషన్"..!

     Written by : smtv Desk | Tue, Feb 13, 2018, 01:27 PM

జమ్మూలో కొనసాగుతున్న ఆ

శ్రీనగర్, ఫిబ్రవరి 13 : జమ్మూకశ్మీర్‌లోని ఆర్మీ క్యాంపు ఆఫీస్ లోకి ఉగ్రవాదులు చొరబడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని భద్రతా దళాలు పసిగట్టి కాల్పులు జరిపాయి. అక్కడ నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి ఇద్దరు ఉగ్రవాదులు ప్రవేశించి తలదాచుకున్నట్లు గుర్తించారు. వారిని అంతమొందించేందుకు నిన్నటి నుండి ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టగా.. మరో ఉగ్రవాది కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో ఆరుగురు సైనికులు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు.

Untitled Document
Advertisements