మూవీ రూల్స్ ను అరికట్టండి : కోన వెంకట్..

     Written by : smtv Desk | Tue, Feb 13, 2018, 02:29 PM

మూవీ రూల్స్ ను అరికట్టండి : కోన వెంకట్..

హైదరాబాద్, ఫిబ్రవరి 13 : కోట్లు ఖర్చు పెట్టి దర్శకనిర్మాతలు ఎంతో వ్యయప్రయాసాల కోర్చి ఒక సినిమాను తెరపైకి తీసుకొస్తే.. వారి కష్టం అంత బూడిదలో పోసిన పన్నీరులా తయారవుతోంది. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే నెట్‌లో ప్రత్యక్షమవుతోంది. ఆ సినిమాలను తీసిన వారికి చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. తాజాగా ఈ విషయంపై కోన వెంకట్.. మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా కంప్లైంట్ చేశారు.

"కేటీఆర్.. వెంటనే "మూవీ రూల్స్" అనే వెబ్‌సైట్‌పై సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఈ వెబ్‌సైట్ కారణంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. వారిని లాక్ చేయించి మమ్మల్ని కాపాడండి. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఇది" అంటూ ఆ సైట్‌లో దర్శనమిస్తున్న తాజా చిత్రాల ఫోటోలను షేర్ చేశాడు.

Untitled Document
Advertisements