సయ్యద్‌ కు షాకిచ్చిన పాక్..

     Written by : smtv Desk | Tue, Feb 13, 2018, 03:15 PM

సయ్యద్‌ కు షాకిచ్చిన పాక్..

ఇస్లామాబాద్‌, ఫిబ్రవరి 13 : ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కర్‌-ఇ-తాయిబా చీఫ్‌ హఫీజ్‌ సయ్యద్‌ కు పాకిస్థాన్‌ పెద్ద షాక్‌ ఇచ్చింది. హఫీజ్‌ను ఉగ్రవాదిగా గుర్తిస్తూ... అతనికి చెందిన సంస్థలపై నిషేధం విధించింది. గతంలో (యూఎన్ఓ) ఐక్యరాజ్యసమితి హఫీజ్‌కు చెందిన లష్కర్‌-ఇ-తాయిబా, జమాత్ ఉద్ దవాలపై నిషేధం విధించింది. గత వారమే పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్‌ ఆర్డినెన్స్‌ పై సంతకం చేసినప్పటికీ.. సోమవారం ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు.

2008 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌తోపాటు అతని ఆధ్వర్యంలోని జమాత్ ఉద్ దవా, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థలపై కూడా చర్య తీసుకునే అవకాశం ఉన్నట్లు పాక్ మీడియా వెల్లడించింది.

Untitled Document
Advertisements