ప్రాన్ కార్డుతో లాభాలెన్నో..

     Written by : smtv Desk | Thu, Feb 15, 2018, 02:03 PM

ప్రాన్ కార్డుతో లాభాలెన్నో..

హైదరాబాద్, ఫిబ్రవరి 15 : పాన్‌ కార్డు.. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించే వారందరికీ ఇది అత్యంత అవసరమైన గుర్తింపు కార్డు.. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కార్డు ప్రాన్ కార్డు (పర్మినెంట్‌ రిటైర్‌మెంట్‌ అకౌంట్‌ నంబర్‌).. 2004 తర్వాత నియమితులైన ఉపాధ్యాయుల, ఉద్యోగులకు ఈ కార్డులను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. చాలామంది పింఛన్‌దారులు దీన్ని వాడకపోవడంతో దీని లాభాలు పొందలేకపోతున్నారు. ఈ సీపీఎస్‌ విధానంలో ఉన్నవారికి ప్రాన్‌ కార్డు తప్పనిసరి.

2004 తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్‌ సదుపాయం లేదు. వీరి జీతాల నుంచే నెలనెలా కొంత మొత్తం ప్రభుత్వం వసూలు చేసి ప్రత్యేక ఖాతాకు ప్రభుత్వం జమ చేస్తుంది. దీన్ని కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం అంటారు.

లాభాలు..
* సీపీఎస్‌ విధానంలో ప్రతినెలా తమ వాటా సొమ్ము ఖాతాకు జమ అవుతోందో లేదో తెలుసుకునే వీలుంది.
*ఖాతాలో ఉన్న సొమ్ము నిల్వ గురించి తెలుసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలకు గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవచ్చు.
* ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలు చేసే సమయంలో ప్రాన్‌ కార్డు తప్పనిసరి
* పింఛన్‌ లావాదేవీలకు పాన్‌ కార్డుతోపాటు ప్రాన్‌ కార్డు కూడా ఉపయోగించవచ్చు.
* ప్రభుత్వపరంగా రుణాలు తీసుకున్నప్పుడు ఉపయోగపడుతుంది






Untitled Document
Advertisements