నేపాల్ ప్రధానిగా ఓలి ప్రమాణస్వీకారం..

     Written by : smtv Desk | Fri, Feb 16, 2018, 10:31 AM

నేపాల్ ప్రధానిగా ఓలి ప్రమాణస్వీకారం..

ఖాట్మండు, ఫిబ్రవరి 16 : నేపాల్‌ 41వ ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలీ (ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి) గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఖాట్మండులోని రాష్ట్రపతి కార్యాలయంలో ఓలీ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఆయన ప్రధానిగా ఎన్నికవ్వడం ఇది రెండో సారి. ఇటీవల జరిగిన చారిత్రక పార్లమెంటు ఎన్నికల్లో వామపక్ష కూటమి ఘనవిజయం సాధించింది. ఓలీ నేతృత్వంలోని నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(సీపీఎన్‌)-యూఎమ్‌ఎల్‌, ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్‌-మావోయిస్టు సెంటర్‌ ఈ కూటమికి నేతృత్వం వహించాయి. 65 సంవత్సరాలు వయసుగల ఓలి చైనాకు ఆప్తుడు. ఆయన తిరిగి ఎన్నిక కావడం భారత్ కు ఇబ్బందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Untitled Document
Advertisements