వాస్తవాలు ప్రజలకు తెలియాలి : పవన్ కళ్యాణ్

     Written by : smtv Desk | Sat, Feb 17, 2018, 11:30 AM

వాస్తవాలు ప్రజలకు తెలియాలి : పవన్ కళ్యాణ్

అమరావతి, ఫిబ్రవరి 17 : . జేఎఫ్‌సీ తొలిరోజు సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. పవన్‌కల్యాణ్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి సమావేశానికి వెళ్లారు. లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ దీనికి నేతృత్వం వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాటకు కట్టుబడి బాధ్యతగా వ్యవహరించకపోతే దేశ సమగ్రతకే భంగం వాటిల్లుతుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు.

వాస్తవాలను ప్రజలకు చెప్పాలనే సదుద్దేశంతో సంయుక్త నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ) ద్వారా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని... ప్రజల్ని, పార్టీలను అయోమయానికి గురిచేస్తున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, ఏపీ మాజీ సీఎస్‌ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు, మాజీ ఐఏఎస్‌ అధికారి చంద్రశేఖర్‌, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీనియనేత వై.వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీనియర్‌నేత గఫూర్‌, సహా పలువురు పాల్గొన్నారు. శనివారం కూడా సమావేశం కొనసాగనుంది.





Untitled Document
Advertisements