కేసీఆర్ కు విన్నూతంగా శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

     Written by : smtv Desk | Sat, Feb 17, 2018, 12:22 PM

కేసీఆర్ కు విన్నూతంగా శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ రోజు 65 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు, అభిమానుల నుండి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అతని కుమారుడు మంత్రి కేటీఆర్‌ విన్నూతంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

‘వీరాధి వీరుడు అతడు.. విజయానికి బావుట అతడు.. ఆవేశపు విల్లంబతడు.. ఆలోచన శిఖరంబతడు.. తలవంచనియోధుడు అతడు.. అభయానికి బాసట అతడు.. జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు’.. అంటూ తన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి గొప్పగా చెప్పారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న.. ఆయురారోగ్యంతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని కేటీఆర్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు.

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియో పాటను రూపొందించారు. దాదాపు 18 మంది టాలీవుడ్‌ గాయకులు ఈ పాటను ఆలపించారు. వీరాధి వీరుడు అతడు.. అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. కేసీఆర్‌ తీసుకొచ్చిన పలు అభివృద్ధి పథకాల గురించి ఈ పాటలో చక్కగా వర్ణించారు.

Untitled Document
Advertisements