సీసీఎస్ కు హాజరైన వర్మ..

     Written by : smtv Desk | Sat, Feb 17, 2018, 01:04 PM

సీసీఎస్ కు హాజరైన వర్మ..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 : వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే దర్శకుడు రాంగోపాల్‌వర్మ హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఇటీవల విడుదలైన ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ (జీఎస్టీ) వెబ్‌ సిరీస్‌ రేపిన పెను దుమారంతో వివాదాల్లో చిక్కుకున్నారు. అశ్లీలతతో పాటు మహిళలను కించపర్చారంటూ వర్మపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి.

పోర్న్‌స్టార్ మాల్కోవా నటించిన జీఎస్టీ.. విడుదలకు ముందు పెను దుమారమే రేపింది. పాశ్చాత్య నగ్న సంస్కృతిని భారతీయ సంస్కృతిపై ఎలా రుద్దతారంటూ చెలరేగిన విమర్శలకు వర్మ తనదైన శైలిలో జవాబిచ్చాడు. దీంతో జీఎస్టీపై వివాదం రేగింది. ఆ తరువాత వర్మపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి.

వాస్తవానికి విచారణకు రావాలంటూ వర్మకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గతంలోనే నోటీసులు జారీచేశారు. విచారణకు హాజరుకాలేనంటూ మొదటిసారి వర్మ బదులిచ్చారు. మళ్లీ నోటీసులు ఇస్తే వస్తానంటూ జవాబిచ్చారు. దీంతో వర్మకు పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన ఈ రోజు సీసీఎస్ ఎదుట హాజరయ్యారు.







Untitled Document
Advertisements