మోదీ ఏపీ ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు : శివప్రసాద్‌

     Written by : smtv Desk | Sat, Feb 17, 2018, 02:47 PM

మోదీ ఏపీ ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు : శివప్రసాద్‌

తిరుపతి, ఫిబ్రవరి 17 : విభజన హామీలను నెరవేర్చాలంటూ తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఎన్‌టీఆర్‌ స్టేడియంలో శుక్రవారం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ఎన్‌.శివప్రసాద్‌ పాల్గొన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో ఏపీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో వెంకన్న స్వామి సాక్షిగా ఆయన ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరిస్తుందని ధ్వజమెత్తారు. వాగ్దానాలు తీర్చకపోతే కాంగ్రెస్‌కు పట్టిన పరిస్థితి భాజపాకూ పడుతుందని శివప్రసాద్‌ వ్యాఖ్యానించారు.

Untitled Document
Advertisements