శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు..

     Written by : smtv Desk | Sun, Feb 18, 2018, 11:58 AM

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు..

తిరుమల, ఫిబ్రవరి 18 : తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజన్ గోగొయ్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తులకు తితిదే ఆధికారులు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు.

Untitled Document
Advertisements