హత్యలా..! ఆత్మహత్యలా..!

     Written by : smtv Desk | Sun, Feb 18, 2018, 02:12 PM

హత్యలా..! ఆత్మహత్యలా..!

ఒంటిమిట్ట, ఫిబ్రవరి 18 : కడప జిల్లా ఒంటిమిట్టలో దారుణం చోటు చేసుకుంది. రేణిగుంట జాతీయ రహదారిని అనుకుని ఉన్న ఒంటిమిట్ట చెరువులో ఈరోజు స్థానికులు ఏడు మృతదేహాలను చూసి హతాశులయ్యారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. వీరిని ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Untitled Document
Advertisements