వివేక్‌కు ఆ సినిమాకు అన్ని కోట్లా..!

     Written by : smtv Desk | Sun, Feb 18, 2018, 03:14 PM

వివేక్‌కు ఆ సినిమాకు అన్ని కోట్లా..!

హైదరాబాద్, ఫిబ్రవరి 18‌: మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. బోయపాటి సినిమా అంటే మాస్ ప్రేక్షకులలో ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. ఈ సినిమాకు ‘జిల్‌ జిల్‌ జిగేల్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇందులో చరణ్‌కి జోడీగా కైరా అడ్వాణీ నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. విలన్‌ పాత్ర కోసం వివేక్‌కి నిర్మాత రూ.3 కోట్లు పారితోషికంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. వివేక్ గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'రక్త చరిత్ర' సినిమాలో పరిటాల రవి పాత్రలో నటించి మెప్పించారు. ఇటీవల ప్రముఖ నటుడు అజిత్‌ నటించిన ‘వివేగం’ చిత్రంలోనూ వివేక్‌ ముఖ్య పాత్ర పోషించారు.

Untitled Document
Advertisements