తొలి టీ-20 మనదే..

     Written by : smtv Desk | Mon, Feb 19, 2018, 12:32 PM

తొలి టీ-20 మనదే..

జొహానెస్‌బర్గ్, ఫిబ్రవరి 19: ఫార్మాట్ ఏదైనా కోహ్లి సేన జోరు ఆగట్లేదు.. దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ ను 5-1 తో కైవసం చేసుకున్న టీమిండియా జట్టు మూడు టీ -20 ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో బోణీ చేసింది. వాండరర్స్‌లో జరిగిన మ్యాచ్ లో బ్యాట్ తో ధావన్, బాల్ తో భువనేశ్వర్ సఫారీలపై సవారీ చేశారు. ఫలితంగా విరాట్ సేన 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్ లో 1-0 ముందజలో ఉంది.

తొలుత టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్ విభాగంలో 'గబ్బర్' శిఖర్ ధావన్ (72) అద్భుతమైన బ్యాటింగ్ తో అలరించాడు. టీమిండియా జట్టులో రోహిత్ శర్మ(15), రైనా(9), కోహ్లి(26), మనీష్ పాండే(29), ధోని(16) పరుగులు చేశారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగుల చేసింది.

అనంతరం భారీ లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన సౌతాఫ్రికా జట్టులో ఓపెనర్ హెన్రిక్స్‌ (70), బెహార్డిన్‌ (39) తప్ప మిగత బ్యాట్స్ మెన్ ఎవరు రాణించలేదు. ఒక దశలో గెలుపు వైపుగా సాగుతున్న ప్రత్యర్థి జట్టు ‘స్వింగ్ కింగ్’ భువనేశ్వర్ దెబ్బ(5/24) కు విలవిలలాడిపోయింది. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 175/9 కి పరిమితం అయింది.

Untitled Document
Advertisements