అమెరికాలో 'అ!' దూకుడు..

     Written by : smtv Desk | Mon, Feb 19, 2018, 04:36 PM

అమెరికాలో 'అ!' దూకుడు..

హైదరాబాద్, ఫిబ్రవరి 19 ‌: వైవిధ్యమైన కథతో నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ, నాచురల్ నాని నిర్మాతగా రూపొందించిన సినిమా 'అ!'. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొని మంచి హిట్ టాక్ అందుకొంది. కాగా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లను రాబడుతున్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో విడుదలైన మూడు రోజుల్లో హాఫ్‌ మిలియన్‌ మార్కును దాటినట్లు సమాచారం. శనివారం 109 లొకేషన్లలో విడుదలైన చిత్రం 181,139 డాలర్లు వసూలు చేసినట్లు చెప్పారు.

రెండు రోజుల్లో (శుక్రవారం, శనివారం) మొత్తం 448,725 డాలర్లు (గ్రాస్‌) సాధించిందని, ఆదివారానికి అర్ధ మిలియన్‌ మార్కును దాటినట్లు పేర్కొన్నారు. కాజల్‌, నిత్యా మేనన్‌, ఈషా రెబ్బా, రెజీనా, శ్రీనివాస్‌ అవసరాల తదితరులు ‘అ!’ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

Untitled Document
Advertisements