నేను బతికే ఉన్నాను : సిల్వెస్టర్‌ స్టాలోన్‌

     Written by : smtv Desk | Tue, Feb 20, 2018, 01:31 PM

నేను బతికే ఉన్నాను : సిల్వెస్టర్‌ స్టాలోన్‌

లాస్‌ఏంజెల్స్‌, ఫిబ్రవరి 20: సామాజిక మాధ్యమాల పుణ్యమని ఇప్పుడు వార్తలు క్షణాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మంచి వార్తలు విషయం పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో వదంతుల బాగా వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం హాలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేస్తుంది.

అదేంటంటే.. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు సిల్వెస్టర్‌ స్టాలోన్‌ చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో రాశారు. మాటిమాటికీ తన గురించి తప్పుడు వార్తలు సృష్టిస్తుండడంతో స్టాలోన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బతికే ఉన్నానంటూ ట్వీట్ చేశారు. ‘ఇలాంటి చెత్త వార్తలను నమ్మకండి. నేను బతికే ఉన్నాను, ఫైట్‌ చేసేంత ఆరోగ్యంగా ఉన్నాను’ అని స్టాలోన్‌ ట్వీట్‌ చేశారు.

2016లో ఓ బ్రిటిష్‌ మీడియా వెబ్‌సైట్‌ స్టాలోన్‌ చనిపోయినట్లు రాసేసింది. దాంతో తాను బతికే ఉన్నాను అని చెప్పుకోవడానికి స్టాలోన్‌ తన స్నేహితుడైన ప్రముఖ రష్యన్‌ బాక్సర్‌ సర్గే కోవాలెవ్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం స్టాలోన్‌ ‘క్రీడ్‌ 2’ చిత్రంలో నటిస్తున్నారు.

Untitled Document
Advertisements