సైనికులతో వాలీబాల్‌ ఆడిన స్టైలిష్ స్టార్..

     Written by : smtv Desk | Tue, Feb 20, 2018, 04:12 PM

సైనికులతో వాలీబాల్‌ ఆడిన స్టైలిష్ స్టార్..

హైదరాబాద్, ఫిబ్రవరి 20 ‌: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ఈ సినిమాలో ఆయన ఆర్మీ అధికారిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇండో-పాక్‌ సరిహద్దులో జరుగుతోంది. అక్కడ సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా సెట్‌లో అల్లు అర్జున్‌ భారత ఆర్మీ అధికారులతో వాలీబాల్‌ ఆడి సందడిగా గడిపారు.ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్‌ అల్లుఅర్జున్ సరసన కథానాయకిగా నటిస్తుంది. బొమన్‌ ఇరానీ, శరత్‌ కుమార్‌, అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నఈ మూవీ ఏప్రిల్‌ 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.


Untitled Document
Advertisements