అందుకే చాహల్ కళ్లజోడు పెట్టుకున్నాడు..!

     Written by : smtv Desk | Tue, Feb 20, 2018, 05:04 PM

అందుకే చాహల్ కళ్లజోడు పెట్టుకున్నాడు..!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 : సఫారీ గడ్డపై టీమిండియా క్రికెట్ జట్టును విజయాల బాట పట్టించడంలో స్పిన్ ద్వయం చాహల్, కులదీప్ యాదవ్ పాత్ర మరువలేనిది. కాగా ఈ మధ్య మణికట్టు మాంత్రికుడు చాహల్‌ మైదానంలో కళ్ల జోడు పెట్టుకుని కనిపిస్తున్నాడు. ఇందుకు కారణం ఏమిటి..? చాహల్‌కు ఏమైఉంటుంది? అన్న అనుమానాలు సగటు అభిమాని మదిని తొలుస్తున్నాయి.

అయితే దీనిపై చాహల్‌ తండ్రి వివరణ ఇచ్చారు. 'కొద్దిరోజుల్లో చాహల్‌ ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరనున్నాడు. ఇందులో భాగంగానే కంటి పరీక్షలు చేయించుకున్నాడు' అని చాహల్‌ తండ్రి వెల్లడించారు. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత చాహల్‌ ఢిల్లీలో ఐటీ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడని ఆయన తెలిపారు.





Untitled Document
Advertisements