మోదీపై సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు..

     Written by : smtv Desk | Tue, Feb 20, 2018, 05:35 PM

మోదీపై సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు..

బెంగళూరు, ఫిబ్రవరి 20 : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అనేక సమస్యలు ఉన్న ఏమి పట్టించుకోనట్లుగా ఆయన వ్యవహరిస్తున్నట్లు దుయ్యబట్టారు. ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రధానమంత్రిగా కొనసాగేందుకు మోదీ అనర్హుడు అంటూ మండిపడ్డారు. నాడు నోట్లు రద్దు చేసి సామాన్య ప్రజలను క్యూలైన్లలో నిలబెట్టించి నేడు.. రూ. 12 వేల కోట్ల ప్రజాధనంతో నీరవ్ మోదీని వెళ్లనిచ్చావు. ఆ డబ్బులో ప్రజల సొమ్ము ఎంత ఉంద౦టూ మోదీని సూటిగా ప్రశ్నించారు.

Untitled Document
Advertisements