గెలిస్తే సిరీస్ మనదే..

     Written by : smtv Desk | Wed, Feb 21, 2018, 11:30 AM

గెలిస్తే సిరీస్ మనదే..

సెంచూరియన్, ఫిబ్రవరి 21 : టీమిండియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో మిగిలిన ఏకైక టీ-20 సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ సెంచూరియన్ వేదికగా ఈ రోజు జరగనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో నెగ్గిన కోహ్లి సేన 1-0 తో ఆధిక్యంలో ఉంది. ఈ టీ-20 లో విజయం సాధించి భారత్ జట్టు సిరీస్ ను ఎగరేసుకుపోవాలని చూస్తుంది. ప్రస్తుతం టీమిండియా జట్టు అన్నిరంగాల్లో దుర్భేద్యంగా కనిపిస్తుంది. బ్యాటింగ్ విభాగంలో శిఖర్ ధావన్, కోహ్లి ప్రత్యర్ధి పాలిట సింహస్వప్నంగా మారారు.

బౌలింగ్ విభాగంలో 'స్వింగ్ కింగ్' భువనేశ్వర్, బుమ్రా, పాండ్యా, స్పిన్ మాంత్రికుడు చాహల్ ఉండనే ఉన్నారు. మరోవైపు ఆతిథ్య జట్టు వరుస ఓటములు పరాభవంతో డీలాపడిపోయింది. వన్డే సిరీస్ ను 5-1 తో ఓడిపోయిన సఫారీ సేన ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ లో పోటీ ఇవ్వాలని భావిస్తుంది. అయితే జోరు మీదున్న కోహ్లి సేన ను ప్రోటీస్ జట్టు ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి.

Untitled Document
Advertisements