పెళ్లికూతురు కాబోతున్న అమీ జాక్సన్ ..

     Written by : smtv Desk | Wed, Feb 21, 2018, 01:58 PM

పెళ్లికూతురు కాబోతున్న అమీ జాక్సన్ ..

హైదరాబాద్, ఫిబ్రవరి 21 : 'మద్రాసపట్టణం' ,'ఎక్ దివాన థ ', 'ఎవడు' లాంటి హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ అమీ జాక్సన్ పెళ్లికూతురు కాబోతుంది. బ్రిటన్ లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జితో అమీ కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఇప్పుడు ఈ ప్రేమ కాస్తా పెళ్లి పీటల వరకు వెళ్లిందని సమాచారం. ఈ ఏడాది వీరిద్దరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

వాలెంటైన్స్ డే రోజు న తన ప్రియుడైన జార్జ్ కి అమీ విష్ చేయగా ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం అమీ జాక్సన్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రోబో 2.౦ సినిమాలో నటిస్తున్నారు. ఇంతకుముందు శంకర్ దర్శకత్వంలో విక్రం హీరోగా వచ్చిన 'ఐ' సినిమాలో అమీ కథానాయకిగా నటించారు.





Untitled Document
Advertisements