కమల్ కు కేటీఆర్ అభినందనలు..

     Written by : smtv Desk | Wed, Feb 21, 2018, 04:32 PM

కమల్ కు కేటీఆర్ అభినందనలు..

హైదరాబాద్, ఫిబ్రవరి 21 : ప్రముఖ నటుడు కమల్‌హాసన్.. నేడు తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు. ఈ మేరకు ఆయన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నివాసం నుండి తన రాజకీయ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. నేటి సాయంత్రం మదురైలో జరిగే సభలో తన పార్టీ పేరును, జెండా వివరాలను కమల్ వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన పలువురు ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించారు.

ఇందులో భాగంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కూడా క‌మ‌ల్ ఆహ్వానించారు. కమల్ కు కేటీఆర్.. "మ‌ధురైలో జ‌రుగ‌నున్న కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీకు ధ‌న్య‌వాదాలు. కాని కొన్ని కార‌ణాల వ‌ల్ల అక్క‌డ‌కు రాలేక‌పోతున్నాను. ఈ కొత్త ఇన్నింగ్స్‌లోనూ మీరు రాణించాల‌ని కోరుకుంటున్నా" అంటూ ట్వీట్ చేశారు.

Untitled Document
Advertisements