తొలి పోరు భారత్ X శ్రీలంక ..

     Written by : smtv Desk | Wed, Feb 21, 2018, 05:17 PM

తొలి పోరు భారత్ X శ్రీలంక ..

కొలంబో, ఫిబ్రవరి 21 : దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్ ముగిసిన తర్వాత కోహ్లీ సేన శ్రీలంక వేదికగా ముక్కోణపు టీ-20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో భారత్-శ్రీలంక- బంగ్లాదేశ్ పాల్గోననున్నాయి. ఈ టోర్నీకి సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. మార్చి 6 నుంచి 18 వరకు నిదాస్‌ ట్రోఫీ జరగనుంది. ఆరంభ మ్యాచ్ మార్చి 6 న ఇండియా- శ్రీలంక మధ్య జరగనుంది.

ఈ ఏడాది శ్రీలంక 70వ స్వాంతత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో లంక బోర్డు నిర్వాహకులు ముక్కోణపు టీ20 సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడాలి. టాప్‌-2లో నిలిచిన జట్ల మధ్య మార్చి 18న ఫైనల్‌ జరగనుంది.

Untitled Document
Advertisements