చైనా టూ కాకినాడ..

     Written by : smtv Desk | Sat, Feb 24, 2018, 11:42 AM

చైనా టూ కాకినాడ..

కాకినాడ, ఫిబ్రవరి 24 : చైనా దేశంలోని ఓ అరుదైన పక్షుల జాతి తూర్పుగోదావరి జిల్లాలో గల కాకినాడలో గుర్తించారు. వీటిని అంతరించిపోయే జాబితాలో ఉన్న 'గ్రేట్‌నాట్‌' అనే అరుదైన పక్షి జాతి అని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇగ్రీ ఫౌండేషన్‌, వన్యప్రాణి అధికారులు తెలిపారు. ఈ జాతి పక్షులు చైనా నుంచి 4,303 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేసి ఇక్కడకు వచ్చాయన్నారు. ఇటీవల పక్షుల గణన సమయంలో తీసిన ఛాయాచిత్రంలో ఒక పక్షి కాలికి తగిలించి ఉన్న రింగు, నలుపు తెలుపు జెండా ఆధారంగా అది చైనా నుంచి వచ్చినట్లు గుర్తించామన్నారు.

ఆ ఛాయా చిత్రాలను చైనా షాంఘైలోని సంబంధిత విభాగానికి పంపించగా అక్కడి అధికారులు స్పందిస్తూ.. ‘ఆ పక్షులు తమ దేశం నుంచి వలస వచ్చాయని.. ఇక్కడ అంతరించిపోతున్న పక్షి జాతులు ఎక్కడకు వలస వెళుతున్నాయో గుర్తించేందుకు ఇలా జెండా, రింగ్‌ తగిలించామని, ఈ పక్షులు సుమారు 460కు పైగా ఉన్నాయని’తెలిపినట్లు స్థానిక వన్యప్రాణి అధికారి వెల్లడించారు.





Untitled Document
Advertisements