మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు....

     Written by : smtv Desk | Mon, Feb 26, 2018, 10:57 AM

 మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు....

బీజింగ్‌, ఫిబ్రవరి 26 : జీ జిన్‌పింగ్‌.. చైనాను తన అప్రతిహత అధికారంతో పాలిస్తూ, మావో సే జడాంగ్ తర్వాత అంతంటి పేరు తెచ్చుకున్న వ్యక్తి. కాగా జిన్‌పింగ్‌ మరో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమవుతుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్ని ఏ వ్యక్తులైనా రెండుసార్లకు మించి చేపట్టకూడదనే రాజ్యాంగ నిబంధనను తొలగించేందుకు చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ(సీపీసీ) సిద్ధమైంది.

సాధారణంగా సీపీసీ పార్టీ సిద్ధాంతాల ప్రకారం.. ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే దేశ అధ్యక్షుడిగా కొనసాగే వీలుంది. ఆ నిబంధనను తొలగించాలని సీపీసీ సెంట్రల్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చైనా అధ్యక్షుడిగా ఉన్న జిన్‌పింగ్‌ పదవీకాలం 2022తో ముగియనుంది. తాజా నిర్ణయం వల్ల జిన్‌పింగ్‌ చైనా అధ్యక్షుడిగా ఎన్నిసార్లయినా పోటీ చేయవచ్చు.





Untitled Document
Advertisements