పరీక్ష కేంద్రాన్ని సులభంగా గుర్తించేందుకు "యాప్"..

     Written by : smtv Desk | Tue, Feb 27, 2018, 01:17 PM

పరీక్ష కేంద్రాన్ని సులభంగా గుర్తించేందుకు

విశాఖ, ఫిబ్రవరి 27 : రేపటి నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మంత్రి గంటా శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 1423 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని.. సమస్యాత్మక ప్రాంతాలు 116 గా గుర్తించినట్లు తెలిపారు. ఇందు నిమిత్తం విజయవాడలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మొత్తం 10,26,891 మంది విద్యార్థులు ఇంటర్ విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. అలాగే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సులభంగా గుర్తించేందుకు ఒక యాప్ కూడా రూపొందించామని మంత్రి తెలిపారు.

Untitled Document
Advertisements