"సీపీసీ" పై విమర్శలు

     Written by : smtv Desk | Tue, Feb 27, 2018, 05:56 PM


బీజింగ్, ఫిబ్రవరి 27 : చైనాను తన అప్రతిహత అధికారంతో పాలిస్తూ, మావో సే జడాంగ్ అంతంటి పేరు తెచ్చుకున్న వ్యక్తి జిన్‌పింగ్‌. కాగా జిన్‌పింగ్‌ మరో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని గురించి వార్తలు సామాజిక మాధ్యమాల్లో విమర్శలకు దారితీశాయి. చైనాలో అద్యక్ష, ఉపాధ్యక్ష భాద్యతలు ఏ వ్యక్తులైన రెండు సార్లకుమించి ఉందకూడదనే రాజ్యాంగ నిబంధన ఉంది. రాజ్యాంగ సవరణ నియంతృత్వ దోరణి అని ఉత్తర కొరియాకు మనకు తేడా ఉండదని హాంకాంగ్‌ ప్రజాస్వామ్యవాది వ్యాఖ్యానించారు. విమర్శలపై వెంటనే స్పందించిన చైనా ప్రభుత్వం.

ప్రభుత్వ వ్యతిరేక కథనాలను నిలిపివేయడంతో పాటు అనుకూల వార్తలను మాత్రమే ప్రచురించింది. దేశ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో ఎవరూ వరుసగా రెండుసార్లు కొనసాగకుండా రాజ్యాంగంలో ఉన్న పరిమితిని ఎత్తివేయాలని పార్టీ కేంద్ర కమిటీ ప్రతిపాదించినట్లు ప్రభుత్వరంగ వార్తా సంస్థ షిన్హువా తెలిపింది. ‘ఇలాంటి విధానాల వల్ల అధికారం మొత్తం ఒక వ్యక్తి చేతిలోనే కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. అది నియంతృత్వానికి దారితీస్తుంది’ అని జోషువా వాంగ్‌ అనే ప్రజాస్వామ్యవాది అన్నారు.





Untitled Document
Advertisements