కుప్పంలో గజరాజుల సంచారం..

     Written by : smtv Desk | Wed, Feb 28, 2018, 03:39 PM

కుప్పంలో గజరాజుల సంచారం..

కుప్పం, ఫిబ్రవరి 28 : జిల్లాలో గల కుప్పం నియోజకవర్గంలో ఐదు రోజులుగా ఏనుగులు చుట్టుపక్కల ప్రజలును భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కర్ణాటక అటవీ ప్రాంతం నుంచి శాంతిపురం మండలంలోకి చొరబడిన గజరాజులు నాలుగు రోజులుగా అక్కడే సంచారిస్తున్నాయి. రాత్రి వేళ పంటపొలాలను ధ్వంసం చేస్తూ భీబత్సం సృష్టిస్తున్నాయి. మూడు రోజుల కిందట ఒక వ్యక్తి ఏనుగుల దాడిలో మరణించాడు. మంగళవారం రాత్రి శాంతిపురం మండలం నుంచి రామకుప్పం మండలంలోకి ప్రవేశించాయి. ఏనుగులను అడవుల్లోకి మళ్ళించేందుకు అటవీ, పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Untitled Document
Advertisements